14-05-2025 12:00:00 AM
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 49 వార్డుల్లో 532 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా వాటిని పరిశీలించి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ పత్రాలను మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
400 నుండి 600 గజాల స్థలంలో ఇంటిని నిర్మాణం చేపట్టాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మంగళవారం మున్సిపల్ పరిధిలో ఒకటో వార్డులో అడ్లూరులో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అంద చేశారు. అధికారులు హౌసింగ్ పిడి విజయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, డిడిఈ వేణుగోపాల్, ఆర్‌ఓ, ఏఈ అశోక్ రాజేందర్ ఇందిరమ్మ లబ్ధిదారులు సిబ్బంది రాజేందర్, కాంగ్రెస్ నాయకులు మహేశ్ పాల్గొన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ ఆశిష్ సంగువన్
కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదవతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుండి 29 వరకు 30 కేంద్రాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.