5 April, 2026 | 10:49 AM

క్యూఆర్ కోడ్‌తో వైద్యసేవలు

07-05-2024 12:26 AM

జహీరాబాద్, మే 6 : జహీరాబాద్ ప్రాంతీయ దవాఖానలో రోగులకు క్యూఆర్ కోడ్‌తో వైద్య సేవలను అందిస్తున్నామని దవాఖాన సూపరింటెం డెంట్ డాక్టర్ శ్రీధర్‌కుమార్ తెలపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం స్థానిక దవాఖానలో క్యూఆర్ కోడ్‌తో వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో భాగంగా రోగులకు వైద్య సేవలను మరింత వేగవంతంగా అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం దన్నారు. వైద్యం కోసం రోగులు దవాఖానకు వచ్చి రోగికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి సంబందిత వైద్యుని వద్దకు జాప్యం లేకుండా ఉండేందుకు గాను క్యూఆర్‌కోడ్ అమలు చేస్తున్నామన్నారు. రోగికి సంబంధించి ఆధార్‌కార్డు, ఫోన్ నంబ ర్, మొబైల్‌కు లింకు ఉన్న వారు నేరుగా క్యూఆర్‌కోడ్ సాయంతో వైద్య సేవలను పొందవచ్చన్నారు. క్యూఆర్ కోడ్ సేవలతో ఓపీ కోసం వరసలో నిలబడే ఇబ్బందులు ఉండవని వివరిం చారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో నాగరాజ్‌పాటిల్, క్యూఆర్ కోడ్ సపోర్టింగ్ ఇంజినీర్ శృతి, వైద్యాధికారులు, సిబ్బం ది పాల్గొన్నారు.