పటాన్‌చెరులో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం
07-05-2024 12:32 AM
పటాన్‌చెరు, మే 6 : పటాన్‌చెరు నియోజవకర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం పటాన్‌చెరులోని స్త్రీ శక్తి భవన్‌లో కొనసాగుతున్నదని నోడల్ అధికారి పీ రాధ, ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి దేవుజా సోమవారం తెలిపారు. మెదక్ పార్లమెంట్‌లో మొత్తం 1287మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖా స్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో సోమవారం మధ్యాహ్నం వరకు 539మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఉన్న మిగ త 16పార్లమెంట్ నియోజకవర్గాలకు సం బంధించి ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులు 236మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖా స్తు చేసుకోగా 93మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నట్లు తెలిపారు.




