05-12-2025 07:36:26 PM
* విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు
* పీహెచ్సీని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ శ్రీరామ్
పాపన్నపేట,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రం పాపన్నపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన తప్పక పాటించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎలక్షన్ బూతుల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ప్రోగ్రామ్ ఆఫీసర్ హరిప్రసాద్, నవ్య, అన్వర్, చందర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు.