05-12-2025 07:41:17 PM
బీజేపీ పార్టీ గూర్రేవుల సర్పంచ్ అభ్యర్థి వాసంపల్లి నందిని
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో బీజేపీ పార్టీ నుంచి గూర్రేవుల గ్రామ పంచాయతీ అభ్యర్థి వాసంపల్లి నందిని నామినేషన్ దాఖలు చేశారు. నాకు అవకాశం ఇచ్చి,నన్ను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఓటు వేసి ఒక్కసారి సర్పంచుగా గెలిపించాలని గూర్రేవుల బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వాసంపల్లి నందిని అన్నారు.
శుక్రవారం గూర్రేవుల గ్రామంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నందిని మాట్లాడుతూ గూర్రేవుల గ్రామంలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. తనను ఓటు వేసి సర్పంచుగా గెలిపిస్తే గూర్రేవుల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.