గర్భిణికి ప్రాణం పోసిన మెడికవర్
హైదరాబాద్, జూలై 6: గర్భాశయాన్ని దాటి మూత్రాశయం వరకు విస్తరించిన అత్యంత అరుదైన ప్లాసెంటా పెర్క్రీటాతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరిన 34 ఏళ్ల గర్భిణి, ఆమె గర్భంలోని 27 వారాల పసికందు ప్రాణాలను హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్ వైద్యులు కాపాడారు.
తీవ్రమైన కడుపు నొప్పి, పొత్తికడుపులో ద్రవం, మూత్రంలో అధిక ప్రోటీన్, ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం, గతంలో సిజేరియన్ చేసిన చరిత్రతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి పరీక్షలు నిర్వహించగా గర్భాశయ ద్వారం ప్లాసెంటా పూర్తిగా మూసిన స్థితిలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. డా. టి. రఘు తేజస్వి, కన్సల్టెంట్ హై రిస్క్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ నే తృత్వంలోని బహుళ విభాగాల వైద్య బృం దం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి, ముందుగా శిశువును సురక్షితంగా ప్రసవింపజేసి అనంతరం సిజేరియన్ హిస్టరెక్టమీ, పాక్షిక మూత్రాశయ తొలగింపు విజయవంతంగా పూర్తి చేసింది.
రక్తస్రావాన్ని నియంత్రించేందుకు పెల్విస్ ప్రాంతం లోని ప్రధాన రక్తనాళాలను కట్టివేసి అత్యవసర రక్త మార్పి డి తదితర ఆధునిక వైద్య విధానాలను వినియోగించారు. శస్త్రచికిత్స అనంతరం గర్భిణి కి ఐసీయూలో చికిత్స అందించగా, డా. శ్రా వణి రెడ్డి కరుమూరు, సీనియర్ ఫిజీషియన్, డా.గౌరీ శంకర్, క్రిటికల్ కేర్ అనస్థీషియా స్పెషలిస్ట్ మరియు వారి బృందం చికిత్స అందించి రోగి కోలుకునేలా చేశారు. ఈ సందర్భంగా డా. టి. రఘు తేజస్వి మాట్లాడుతూ, ముందస్తు నిర్ధారణ, అనుభవజ్ఞులైన మల్టీడిసిప్లినరీ వైద్య బృందం, అత్యాధునిక సదుపాయాలు ఉంటేనే ఇలాంటి అత్యంత ప్రమాదకర గర్భధారణల్లో తల్లి, శిశువును కాపాడడం సాధ్యమవుతుందని తెలిపారు.






