7 July, 2026 | 1:51 AM

ఘనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు

07-07-2026 12:00 AM
  1. 2024 బ్యాచ్‌కి వీడ్కోలు సమావేశం
  2. 2025 బీఎడ్ స్పెషలైజేషన్ బ్యాచ్ ఆధ్వర్యంలో నిర్వహణ  

హైదరాబాద్, జూలై 6(విజయక్రాంతి): స్పెషల్ ఎడ్యుకేషన్ 2024 బ్యాచ్ ఫేర్‌వెల్ కార్యక్రమాలు 2025 బీఎడ్ స్పెషలైజేషన్ హియరింగ్ ఇప్ముర్మైంట్ రెగ్యులర్ కోర్స్ చేస్తున్న వారు సోమవారం ఘనంగా వీడ్కో లు సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ము ఖ్య అతిథిగా కళాశాలల యజమాని పటాన్ ఉమర్ఖాన్ హాజరై మాట్లాడారు. బీఎడ్ స్పెషలిస్, బీఎడ్ స్పెషలైజేషన్ అనేది ఎంతో గొప్ప కోసమే ఈ కోర్సు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించబడిందన్నారు.

అదే విధంగా ఉస్మానియా యూని వర్సిటీ అనుబంధంగా నిర్వహిస్తూ ఈ కో ర్సు పూర్తి చేసిన వారు ఆర్‌సీఐ ద్వారా లై సెన్స్ పొంది తద్వారా వారు దివ్యాంగులైనా పిల్లలకి సరైన పద్ధతిలో ట్రీట్‌మెంట్ ఇస్తూ వారి అవసరాల వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దుతూ వారికి స్పీచ్ తెరపిలో శిక్షణ నివ్వడం స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా వారికి చక్కటి పాఠ్యాంశాలను బోధిస్తూ వారిని మెయిన్ స్ట్రీమ్‌లో కలపడం జరుగుతుంది.

ఇలాంటి కోర్సులు చేయడం ద్వారా విద్యార్థులు ఎంతో ఉన్నతంగా ది వ్యాంగుల పట్ల ఆలోచిస్తూ వారి ప్రతిభను గుర్తిస్తూ వారిని సమ్మిళిత విద్యలు చేర్పించ డం జరుగుతుంది. నిజంగా ఈ కోర్స్ చేయ డం అంటే సమాజంలో మనం ఎంతో సేవ నివృత్తితో ఉన్నామని అర్థం. ఇలాంటి కో ర్సులు చేయడానికి మరింత మంది అర్హులైన వాళ్లు ముందుకొచ్చి దివ్యాంగులకు స రైన విద్యను అందిస్తూ వారిని సమాజంలో ఒక భాగంగా ఉంచడమే అంతిమ లక్ష్యమని చెప్పారు.

డాక్టర్ ఆర్ముగం ప్రిన్సిపాల్ కం డైరెక్టర్ ఆడియోలజీ స్పీచ్ డిపార్ట్‌మెంట్ వారు కూడా కొన్ని ముఖ్య విషయాలను ప్ర స్తావించారు. అలాగే విద్యార్థిని విద్యార్థులు వారి వారి టాలెంట్ అనుగుణంగా ఆటపాటలతో అలరించారు. వారి  కోర్స్ వ్యవధిలో జరిగిన అనుభవాన్ని ఈ మీటింగ్‌లో ప్రస్తావించారు. తద్వారా ఏం నేర్చుకున్నారు ఇం కా ముందు ఏం చేయాలనుకున్నదో వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ఇక్కడ వారు చెప్పారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశిధర్ రెడ్డితో పాటు మిగతా టీచర్లు కూడా వారు ఈ కోర్సుకు సంబంధించిన విషయాలు, వి ద్యార్థుల పురోగతి గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 2025.26 విద్యార్థినీ విద్యార్థులు, అవుట్ గోయింగ్ 2024.26 విద్యార్థి నీ విద్యార్థులకు పాల్గొన్నారు. స్పీచ్ ఆడియో లో విభాగానికి సంబంధించిన డాక్టర్ విద్య స్పీచ్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సుస న్,  మిగతా టీచర్లందరూ పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.