28-11-2025 08:46:58 PM
బేల,(విజయక్రాంతి): ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున యాభై వేల రూపాయల కంటే అధికంగా ఉంటే అలాంటి డబ్బులను సిజ్ చేయడం జరుగుతుందని బేల మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్ రావ్ అన్నారు. బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక మండల అధికారులు, వివిధ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక ఎన్నికల పైన సమావేశం ఏర్పాటు చేశారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు అయిన సందర్బంగా మండలంలోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల నియామవాలి గురించి సూచించారు. మండలంలోని బేల, చప్రాల, దహెగావ్, సదల్ పూర్, సాంగిడి, సిర్సన్న, ఆరు క్లస్టర్ పరిధిలో ఆయా గ్రామాల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెసులుబాటు కల్పించారు. ముందస్తుగానే ఏక గ్రీవంగా తీర్మానం చేయడం చల్లదన్నారు. ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయాల్సిందేనని పేర్కొన్నారు.