మెదక్‌లో మెగా రక్తదాన శిబిరం
ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు
మెదక్, జూన్ 3(విజయ క్రాంతి) : జనహృదయ నేత, జనం మెచ్చిన నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్లో కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో న్యాయవాది జీవన్ రావుతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు,పలువురు యువకులు, అభిమానులు రక్తదానాన్ని చేశారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి. జగపతి, కృష్ణారెడ్డి,గంగా నరేందర్, మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ కుమార్,మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో..
పాపన్నపేట, జూన్ 3: మాజీ మంత్రి, భారాస ట్రిపుల్ షూటర్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు బుధవారం ప్రసిద్ధ పు ణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం వద్ద ఘనం గా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. రాజగోపురం వద్ద కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాం టారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో హరీష్ రా వు ఉద్యమ ఒక కెరటంగా తెలంగాణ సాధనలో ముఖ్యపాత్ర పోషించారన్నారు. కార్య క్రమంలో నాయకులు సోములు, బాలాగౌడ్, గురుమూర్తి గౌడ్, శ్రీనాథ్, సర్పంచు లు సురేష్, గంట రాణి సుధీర్, నాయకులు సొంగ పవిత్ర దుర్గయ్య, కాశీనాథ్ రావు, శ్రీనివాస్, కొండల్ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్, జగదీష్ చారి, కిరణ్ గౌడ్, నవీన్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం డివిజన్ పరిధిలో..
రామచంద్రపురం జూన్ ౩: రామచంద్రపురం డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, శాసనసభ ఉపనేత తన్నీరు హరీష్ రావు జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వి.ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హరీష్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ , బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్, డివిజన్ బిఆర్‌ఎస్ నాయకులు, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి..
సిద్దిపేట రూరల్, జూన్ 3:మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు జన్మదిన వేడుకలను నారాయణరావుపేట మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బొంగరం ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి హరీశ్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బింగీ నవీన్, బీఆర్‌ఎస్ నాయకులు భాగన్నా బుగ్గరాజు, రాజవేణి రవి, బొంగరం రఘుపతి రెడ్డి, భాగన్నా రామచంద్రం, లోకం సత్తయ్య, నరేష్, లక్ష్మణ్తో పా టు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






