05-01-2026 11:56:26 AM
ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురి ఆరోగ్యం మెరుగు పడుతుంది, సర్పంచ్ కోడాల వెంకటరెడ్డి
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం రాజపేట తండా గ్రామపంచాయతీ పరిధిలో కె.వి.ఆర్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సంస్థ చైర్మన్ ఆ గ్రామ సర్పంచ్ కోడాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మహారక్తదాన శిబిరమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఒకరు చేస్తే ముగ్గురి ఆరోగ్యం మెరుగుపడుతుందని, అందుకోసం యువత ముందుకు రావాలని కోరారు.
హైదరాబాద్ నాగోల్ చౌరస్తాలోని ఎస్.ఎల్.ఎం.ఎస్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు శిబిరంలో పాల్గొని, యువత నుండి రక్తమును సేకరించారు. పలువురు యువత ఉత్సాహంతో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాన చేసిన దాతలకు ఐదు లక్షల యాక్సిడెంట్ బెనిఫిట్ కింద ఇన్సూరెన్స్ కూడా అందజేసేందుకు ధ్రువపత్రాలను కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు కొడాల అల్వాల్ రెడ్డి, బుచ్చా నాయక్ రవి అంజిరెడ్డి,సుధీర్ నయీమ్ రవి, దేవేందర్, వెంకటేష్, వినోద్ కుమార్, మోహిన్, రాజశేఖర్ అశోకు, కృష్ణ, నరేష్, శివ ,ప్రణీత ,అనుష, స్నేహ, స్వాతి, తదితరులుపాల్గొన్నారు.