05-01-2026 12:47:39 PM
తుంగతుర్తి సివిల్ కోడ్ జడ్జ్ ఎండి గౌస్ పాష.
తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తిలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్జి ఎండి.గౌస్ పాషా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడు బాధ్యత అని అన్నారు. ప్రమాదాలు జరుగుతే కుటుంబాలు మొత్తం వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహన దారుడు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్ లైసెన్సు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను తప్పనిసరి కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తిజ్ఞానసుంద