calender_icon.png 8 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణ భద్రతల దృష్ట్యా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

06-01-2026 09:37:18 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సందర్భంగా మేడిపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 11 గంటలకు  ఉప్పల్ డిపో సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ వాహన తనిఖీలలో భాగంగా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై 16 ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా, రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు.ప్రజల ప్రాణ భద్రతల దృష్ట్యా, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.