06-01-2026 09:49:49 PM
ఐటీడీఏ పీఓ యువరాజ్ మార్మాట్
ఉట్నూర్,(విజయక్రాంతి): ఈనెల 7,8,9 తేదీలలో వరంగల్ జిల్లా ఎటునాగారంలో నిర్వహించే రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచి ఉమ్మడి జిల్లాకు రాష్ట్రస్థాయిలో ఛాంపియన్ షిప్ తీసుకురావాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ సూచించారు. మంగళవారం ఉట్నూర్ లోని కే.బి కాంప్లెక్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరిగిందని గుర్తు చేశారు.. రాష్ట్రస్థాయిలో క్రీడా ప్రతిభను చూపించాలని అన్నారు.