calender_icon.png 8 January, 2026 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధే బీజేపీ లక్ష్యం

06-01-2026 09:29:09 PM

పదో విద్యార్థులకు మోడీ గిఫ్ట్ సైకిళ్ల పంపిణీ

కోనరావుపేట,(విజయక్రాంతి): విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ మండల అధ్యక్షులు మిరియాల్కర్ బాలాజీ అన్నారు.మంగళవారం కోనరావుపేట మండలంలోని నిమ్మపెల్లి, మరిమడ్ల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వదవ తరగతి విద్యార్థులకు మోడీ గిఫ్ట్ గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అందజేసిన సైకిల్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సమయానుకూలంగా పాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్లు ఉపయోగపడతాయన్నారు. మంచి విద్యలో వెనుకబాటు తనాన్ని తొలగించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ఫీజు మొత్తం ఎంపీ బండి సంజయ్ కుమార్ చెల్లించారన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటించాల్సిన అలవాట్లపై అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడిచి సమాజానికి విద్యార్థులు ఉపయోగపడాలన్నారు. అంతేకాకుండా మద్యపానం, ధూమపానం సేవించే వారిని నివారించేందుకు విద్యార్థులు అవగాహన కల్పించాలన్నారు. విద్యతోపాటు ఆటలపై కూడా విద్యార్థులు ఆసక్తి కనపరచాలన్నారు.