06-01-2026 10:01:00 PM
ఉప్పల్,(విజయక్రాంతి): మారకద్రవ్యాలు డ్రగ్స్ గంజాయి వంటి క్రమ విక్రయాలు జరిగితే ప్రజలు1908 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఈగల్ ఫోర్స్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కె సైదులు విజ్ఞప్తి చేశారు. నాచారం హెచ్ఎంటి డెవలప్మెంట్ ఫోరం యాంటీ డ్రగ్స్ సే నోటు డ్రగ్సన్ నిదానంతో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు లోను కావద్దని, తమ జీవితాన్ని ఆగం చేసుకోకుండా మారక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన ఆయన సూచించారు.
మారక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన ఆలోచనతో ముందుకు ముందుకు సాగుతూ మంచిదారులు నడిచి జీవితంలో విజయం సాధించాలన్నారు. జీవితాలను నాశనం చేసే డ్రస్సును తరిమేసి జీవితాన్ని కాపాడుకుందాం అంటూ విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి మై బల్లి ఫోరం నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి మామిడాల సంతోష్ రెడ్డి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు