calender_icon.png 8 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊడిపడ్డ బస్సు డోరు.. తప్పిన ప్రమాదం

06-01-2026 09:41:20 PM

కోదాడ,(విజయక్రాంతి): పట్టణంలోని నయానగర్ లో ఉన్న అక్షయ ఫౌండేషన్ స్కూల్ కు చెందిన బస్సు మంగళవారం సాయంత్రం విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా అనంతగిరి రోడ్డులో కిట్స్ కాలేజ్ సమీపంలో ఎమర్జెన్సీ డోర్ ఊడి బయటకు పడిపోయింది. అక్కడ వాహనదారులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ గమనించి బస్సు ఆపి డోరును బస్సులోకి ఎక్కించి, ప్రయాణం కొనసాగించాడు. ఈ సంఘటన పట్టణంలోని స్కూల్స్, కాలేజీల బస్సులు ఫిట్ నెస్ కలిగి ఉన్నాయా, విద్యార్థులు సురక్షితమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.