calender_icon.png 8 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీర్కూర్ పీహెచ్సీ వైద్యాధికారి లైంగిక వేధింపులు

06-01-2026 09:57:35 PM

ఓ ఫార్మసిస్ట్ వైద్యాధికారిపై పోలీసులకు ఫిర్యాదు

కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న బీర్కూర్ పోలీసులు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి లైంగిక వేధింపులకు పాల్పడారని ఓ ఫార్మసిస్ట్ బీర్కూర్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. లైంగిక ఆరోపణలపై బీర్కూర్​ పీహెచ్​సీ వైద్యాధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఓ ఫార్మాసిస్ట్ వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు బీర్కూర్ పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యాధికారి లింగాల నాగ గిరీష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇన్​ఛార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వో రోహిత్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని వైద్య సిబ్బందితో కేసు వివరాలపై విచారణ జరిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.