మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
- నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం
- నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్ర భుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా కార్యక్రమాలను చేపడు తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా శిక్షణ, ఉపాది కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్‌కామ్ సౌజన్యంతో గురువారం వర్ని చౌరస్తా జనార్దన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యే భూప తిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి కార్యక్రమాన్ని ప్రా రంభించారు.
విభాగాల వారిగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విదేశి పెట్టుబడులను తెస్తున్నట్టు చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో శిక్షణ, ఉపాధిశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ (ఐఏఎస్), అధికారి వేల్పుల విజేత, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు మునిపల్లి సాయరెడ్డి, అమృతాపూర్ గంగాధర్, పి శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్,ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు అంబర్ సింగ్, గాదె నరేష్, గోవర్ధన్‌రెడ్డి, చింతల కిషన్, బొర్గం కో ఆప్షన్ మెంబర్ అశోక్ పాల్గొన్నారు.






