28-07-2025 12:54:41 AM
కరీంనగర్ క్రైం, జూలై27(విజయక్రాంతి): సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ సౌజన్యంతో ముకరంపురలోని వాణినికేతన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం మెగా సక్సెస్ కావడం పట్ల నరేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.అయిదు వందల మంది పైగా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారని అనుభవం గల వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా ఈసిజి,టుడి ఈకోతో పాటు అన్ని రకాల పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలవల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల ముందు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ అన్ని పరీక్షలు బయట చేయించుకోవాలంటే దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని దాదాపు మూడు లక్షల రూపాయల విలువ గల మందులు ఉచితంగా ఇవ్వడం జరిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు.మెగా సక్సెస్ చేసిన ప్రజలకు సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి నరేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ మెగా వైద్య శిబిరంలో సీనియర్ కార్డియాలజిస్ట్ డా.కె కిరణ్ కుమార్,జనరల్ ఫిజీషియన్లు డా.జె సురేష్,సి హెచ్ కార్తీక్,న్యూరో సర్జన్ డా.కె శివ కుమార్,ఆర్థోపెడిక్ డా.కె రవికాంత్,గైనకాలజిస్ట్ డా.ఈ నయని, మార్కెటింగ్ హెడ్ కె ప్రసాద్ సిబ్బంది మరియు మాజీ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్,ఆర్ష మల్లేశం,కాంగ్రెస్ నాయకులు గడమల్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.