calender_icon.png 22 December, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పింఛన్‌ను పునరుద్ధరించాలి

22-12-2025 12:00:00 AM

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛ న్ పథకాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించాలని, 52 శాతం ఫిట్మెంట్‌తో పీఆ ర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లోని డీఏలను తక్షణమే విడుదల చేయాలని కో రింది. టీఆర్టీఎఫ్ 80 ఏండ్ల అభ్యుదయోత్సవం విద్యాసదస్సును రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

మంత్రు లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్ర భాకర్, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పాల్గొని ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామ ని చెప్పారు. ఈ సందర్భంగా 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్‌ను అమలుచేయాలని, హైస్కూళ్లకు హెచ్‌ఎం, పీఈ టీ పోస్టులను మంజూరుచేయాలని, జీపీఎఫ్ వడ్డీరేట్లను ప్రకటించాలని, ఏటా పదోన్నతులు, బదిలీల క్యాలెండర్‌ను అమలు చేయాలని, ప్రైమరీ స్కూళ్లకు పీఎస్ హెచ్‌ఎం పోస్టులను మంజూరుచేయాలని కోరుతూ సదస్సులో తీర్మానా లను ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రులు టీఆర్టీఎఫ్ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు.