calender_icon.png 14 May, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీఎంట్రీకి మెగా ఆఫర్!

14-05-2025 12:25:52 AM

చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ ప్రస్తుతం యూట్యూబ్‌లో 250 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ సినిమాతో ఓ అందాల భామ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆ బ్యూటీ రీఎంట్రీ వార్త ఇప్పుడు ఫిల్మ్‌సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ఆ భామ ఎవరో కాదు.. ‘ప్రేమకావాలి’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇషా చావ్లానే. ఆ సినిమాలో ఆదిసాయికుమార్‌తో జోడీ కట్టిన ఇషా..

ఆ తొలి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా, ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. అలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి కొంత కాలం దూరమైందీ అమ్మడు. చాలా కాలం తర్వాత అందుకున్న తాజా మెగా ఆఫర్‌తోనైనా ఇషా కెరీర్ పరుగులు పెడుతుందా? చూడాలి!