సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యుల తిరిగి బాధ్యతలు స్వీకరణ
ఆర్డర్ కాపీని అందజేసిన సొసైటీ సీఈవో
నాగిరెడ్డిపేట్,మే 5 (విజయక్రాంతి): గత డిసెంబర్ నెల 19వ తేదీన సింగల్ విండో పాలకవర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై పలువురు సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో పాత పాలకవర్గ సభ్యులకు పదవి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జిల్లా సహకార సంఘాధికారి రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం అధ్యక్షులు పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
తాండూర్ కిచ్చన్నపేట సహకార సంఘం అధ్యక్షులుగా,పాలకవర్గం సభ్యులుగా తిరిగి పాత వర్గం సభ్యులకు బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు రావడంతో అట్టి ఆదేశాల మేరకు గతంలో తాండూర్ సొసైటీ సహకార సంఘం అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఆకిడి గంగారెడ్డికి, పాలకవర్గం సభ్యులకు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్డర్ కాపీని అందజేయడం జరిగిందని సీఈవో మురళి తెలిపారు.
గతంలో తాండూర్ సొసైటీ పాలకవర్గం ఏవిధంగా బాధ్యతలు చేపట్టారో వారికి తిరిగి ఉన్నత అధికారుల ఆదేశానుసారం ఆర్డర్ కాపీని అందించి బాధ్యతలు అప్పజెప్పినట్లు సొసైటీ సీఈవో మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో మురళి,సొసైటీ అధ్యక్షులు ఆకిడి గంగారెడ్డి, ఉపాధ్యక్షులు మిద్దె బాబురావు,డైరెక్టర్లు వేముల సంగయ్య,స్వరూప,విజయ్ కుమార్,బన్సీ,కిషన్ నాయక్, హనుమ,తాండూర్ ఉప సర్పంచ్ అభిషేక్, కాంగ్రెస్ నాయకులు సంజీవులు, దివిటీ కిష్టయ్య,హనుమంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.






