calender_icon.png 13 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు

13-01-2026 12:27:37 AM

మల్యాల, జనవరి12(విజయక్రాంతి): జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ కొండగట్టు ఆంజనేయ స్వామి ని సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వడ్డేపల్లి రాంచందర్ ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సం స్థలు) బి. రాజగౌడ్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ లు మ ర్యాద పూర్వకంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మా ట్లాడుతూ భక్తి శ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి, సౌకర్యాలపై అధికారులతో చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. భద్రత, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ప్ర శాంత వాతావరణాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్ రా వు, మల్యాల ఎమ్మార్వో వసంత మరియు తదితరులు పాల్గొన్నారు.