13-01-2026 12:28:51 AM
ముకరంపుర, జనవరి 12 (విజయ క్రాంతి): తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ పొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, జిల్లా కా ర్యదర్శి వి. శంకరయ్య, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు టిఎన్జీవోల జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్విందర్ సింగ్, పట్టణ అధ్య క్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు.