13-01-2026 12:25:58 AM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,జనవరి 12,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జేఎన్టీయూ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కే. వెంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ కళాశాల తరగతి గదులు, ల్యాబ్, క్యాంటీన్, వంటగది పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు.
కళాశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, బాలికల హాస్టల్కు రూ.10 కోట్లతో నిర్మాణం కొనసాగుతోందని, త్వరలో శాశ్వత భవనం మం జూరు చేస్తామని తెలిపారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచిత కోచింగ్, ఉద్యోగ అవకాశాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్, స్పోరట్స్ యూ నివర్సిటీలు, వేములవాడకు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు.