11-08-2025 05:34:35 PM
ఎరువుల కొరత లేకుండా అప్రమత్తంగా ఉండాలి..
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): పిల్లలకు శరీరంలో ఏర్పడే నులిపురుగులు రక్తహీనతకు కారణమవుతాయని, కాబట్టి వాటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) అన్నారు. సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా స్థానిక మరికుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు(ఆల్బెండజోల్) తినిపించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతి ఒక్కరూ తినడానికి ముందు తర్వాత పరిశుభ్రంగా చేతులను కడుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రతతో భోజనం చేస్తే క్రిములు శరీరంలోకి వెళ్లి నులిపురుగులు తయారవుతాయని చెప్పారు. అదేవిధంగా, పిల్లలు మట్టిలో ఆడడం, ఆ తర్వాత నేరుగా తినడం వల్ల శరీరంలో నులిపురుగులు తయారవుతాయని వివరించారు.
ఎరువుల కొరత లేకుండా అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ప్రమతంగా ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాతకోట లో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో ఉన్న ఎరువుల నిల్వకు సంబంధించి బోర్డును పరిశీలించారు. సేల్ రిజిస్టర్ను, స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేసి అవసరమైనంతవరకే రైతులకి యూరియా బస్తాలను విక్రయించాలని, అదనంగా విక్రయించవద్దని సూచించారు. రైతులకు అనుకూలంగా యూరియా నిలువకు సంబంధించిన బోర్డు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. రైతులకు కావాల్సిన ఎరువులను అందుబాటులో ఉంచాలని కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు, డిజిసిఒ సుబ్బలక్ష్మి, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి, ఇతర వైద్యాధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.