calender_icon.png 11 August, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలి

11-08-2025 05:02:50 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీతో పాటు అవసరమైన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil) రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే కాకుండా అంతకు ముందుగా కూడా ఓటర్ల జాబితా సవరణలు, క్లైములు, అభ్యంతరాల పరిష్కారం, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, మార్పు వంటి అంశాలపై తగిన సలహాలు, సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించిందన్నారు. ఆ మేరకు  ప్రతినెలా గుర్తింపు పొందిన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకుని ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

రాజకీయ పార్టీ ప్రతినిధులు చురుగ్గా ఉండి వారి దృష్టికి వచ్చిన ఎన్నికల అంశాన్ని ఏమైనా ఉంటే వాటిని సమావేశంలో తెలియజేయాలన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిదిద్దడం వలన స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందని అన్నారు. ప్రతి బిఎల్ఓ కు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను తప్పనిసరిగా నియమించాలని, రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. సమయంలో హడావుడి చేయకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలు లో మౌలిక సదుపాయాలు కల్పన, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని తద్వారా వాటిని పరిష్కరిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు హక్కు పొందవచ్చని, ఇందుకోసం ఇందుకోసం వారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆ దిశగా రాజకీయ పార్టీలు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ,ఎలక్షన్ సెల్ సూపర్డెంట్లు, ముజాహిద్,రంగ ప్రసాద్ ,భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ నోముల రమేష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ అగర్వాల్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అన్నవరపు సత్యనారాయణ, కమ్యూనిస్టు పార్టీ ఇండియా శ్రీనివాస్, ఆమ్ ఆఫ్ ది పార్టీ  రాంబాబు, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.