11-08-2025 05:10:38 PM
పెన్ పహాడ్: జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్బంగా సోమవారం మండల కేంద్రంలో మండల వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా 19 సంవత్సరాలలోపు కేజీబీవీ, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ 400 mg మాత్రల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యక్తీ గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మల విసర్జన వెళ్లిన తరువాత శుభ్రత, భోజనం చేసే సమయంలో శుభ్రంగా చేతులు కడుకోవడం, మట్టిలో ఆటలు ఆడేటప్పుడు కాళ్ళకు చెప్పులు ధరించాలని, శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలని సూచించారు. నులిపురుగుల బారిన పడినట్లైతే రక్త హీనత బారినపడి తరుచుగా అనారోగ్యానికి గురవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ధరావత్ లాలూనాయక్, మండల వైద్యాధికారి డాక్టర్. రాజేష్, మండల అభివృద్ధి అధికారి జానయ్య, మండల విద్యాధికారి రవి, సామాజిక అరోగ్య అధికారి అనంతలక్ష్మి, హెడ్ మాస్టర్ కృష్ణప్రసాద్, ఆరోగ్య విస్తరణ అధికారి తాడూరి వెంకన్న, హెల్త్ సూపర్వైజర్లు వెంకయ్య, పూలమ్మ హెల్త్ అసిస్టెంట్లు వీరమ్మ, వెంకటరమణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.