calender_icon.png 11 August, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలి

11-08-2025 05:40:45 PM

స్థానిక సమస్యలపై నిరంతర పోరుకు సిద్దం..

నిరసన ర్యాలిలో మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్..

తిమ్మాపూర్ (విజయక్రాంతి): గత ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు‌ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, మండలంలో పేరుకు పోయిన పలు సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపాలని బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్(BJP Mandal President Enugula Anil) డిమాండ్ చేశారు.

మండలంలో వివిధ గ్రామాలలో గత కొన్ని రోజులుగా పేరుకుపోయిన ఈ క్రింది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శంకరపట్నం బీజేపీ మండల శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికారిక ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డిలు మాట్లాడుతూ, మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కరీంపేట వరకు రోడ్డు వెడల్పు వెంటనే చేపట్టాలని, కన్నాపూర్, రాజాపూర్, కాచాపూర్, గద్దపాక గ్రామాల మీదుగా ఉన్న బిటి రోడ్డును వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, ఎమ్మెల్యే ఎన్నికల హామీలలో భాగంగా సంవత్సరంలోపే నిర్మాణం చేపడతానన్న కన్నాపూర్ నుండి అర్కండ్ల వెళ్లే వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని, కేశవపట్నం వయా పాపయపల్లి నుండి ఎగ్లాస్ పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, ముత్తారం నుండి ఎరడపల్లి వరకు బీటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లింగాపూర్ నుండి పోతిరెడ్డిపేట వరకు బీటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని అన్నారు.

అసంపూర్తిగా నిర్మించిన అరుంధతి కళ్యాణమండపాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తిచేయాలని, గుడాటిపల్లి నుండి మెట్‌పల్లి వరకు బిటి నిర్మాణం చేపట్టాలని, అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, క్లోరినేషన్, దోమల నివారణకు దోమల మందు స్ప్రే చేయించాలని‌ డీమాండ్ చెశారు. ఇట్టి సమస్యల పరిష్కారానికి  మానకొండూరు శాసనసభ్యులు వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేయించి పనులు పూర్తి చేయించాల్సిందిగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా గ్రామాల ప్రజలతో అతి త్వరలో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, నాయకులు దొంగల రాములు, జంగ జైపాల్, దాసారపు నరేందర్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, పడాల వెంకటలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి. గౌరవేని శ్రీనివాస్, చెర్ల శ్రీనివాస్, అంతం రాజిరెడ్డి, ఐలయ్య. సుదగోని శ్రీనివాస్, పెసరి వీరార్జున్, నిమ్మశెట్టి సంపత్. దాసరి సంపత్, కాంతాల‌‌ రాజిరెడ్డి, బొజ్జ సాయి నూనె కొండల్ రెడ్డి. బోడ చుక్కల శ్రీకాంత్.పోతునూరి రాజు, తుమ్మరాజు. గూళ్ళ రాజు. నరసయ్య. రాజేందర్, అరవింద్. శ్రీకాంత్ లతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, తోట అనిల్. రవి. రాజు. సతీష్. సాగర్. శ్రీకాంత్. బిట్టు. సందీప్. తిరుపతి.నాయకులు పాల్గొన్నారు.