calender_icon.png 30 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పివి రావు మాల మహానాడు గొండ్రియాల గ్రామశాఖ అధ్యక్షుడిగా వెంకట్రామయ్య

29-07-2025 09:03:58 PM

రాష్ట్ర అధ్యక్షులు సాలే రామారావు..

కోదాడ: పివిరావు మాలమహానాడు అనంతగిరి మండలం(Ananthagiri Mandal) గుండ్రియాల గ్రామశాఖ అధ్యక్షుడిగా కంకణాల వెంకటరామయ్యను రాష్ట్ర అధ్యక్షులు సాలే రామారావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు నియోజకవర్గ అధ్యక్షులు గాదరి డానియల్ మంగళవారం తెలిపారు. పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన నియోజవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు గ్రామ శాఖ, మండల అధ్యక్షులు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన పివి రావు మాల మహానాడు సంఘాలను పటిష్టం చేయాలని తెలిపారు. సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లె రామకృష్ణ, చేపూరి కళ్యాణ్, పల్లె సైదులు, రాములు, చేపూరి గోపి, పాల్గొన్నారు.