calender_icon.png 30 July, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా సమితి ఆధ్వర్యంలో బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

29-07-2025 08:32:14 PM

మణుగూరు (విజయక్రాంతి): సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యావరణ ప్రేమికులు బలరాం నాయక్(Singareni CMD Balram Naik) జన్మదిన వేడుకలను మంగళవారం ఏరియా సింగరేణి సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అశ్వాపురంలోని ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి క్వింటా బియ్యం అందజేసి, సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. సేవా సభ్యులు  నాసర్ పాషా, జమీల, హుమాయున్ లాహ్యా దంపతులు కేక్ కట్ చేసి, మొక్కలను నాటి వృద్ధులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికులతో మమేకమై సిఎండి బలరాం పర్యావరణ ప్రేమికులుగా ఎంతో గుర్తింపు పొందారన్నారు. పచ్చదనం పెంపుకై ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో సంధ్య, మంగీలాల్, బాబురావు, శివరామకృష్ణ పాల్గొన్నారు.