29-07-2025 08:53:39 PM
కొప్పుల జైపాల్ రెడ్డి..
మునగాల (విజయక్రాంతి): ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి(Congress Party President Koppula Jaipal Reddy) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపాల్ మాట్లాడుతూ... నేడు రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ శాసనసభ సభ్యురాలు పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకమైన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రం రైతు వేదికలో నిర్వహించడం జరుగుతుంది. కావున మండలంలోని అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.