calender_icon.png 30 July, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మమ్మ కన్నుమూత

29-07-2025 09:38:17 PM

చిలుకూరు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు హుజూర్నగర్ మాజీ శాసనసభ్యులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ దొడ్డ నరసయ్య సతీమణి కామ్రేడ్ దొడ్డ పద్మమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కి తరలించారని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించారని సిపిఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు(CPI Party District Secretary Bezawada Venkateshwarlu) తెలియజేశారు. ఆమె అంత్యక్రియలు బుధవారం ఆమె స్వగ్రామమైన చిలుకూరు గ్రామంలో ఉదయం 11, గంటలకు జరుగుతాయని, ఆమె అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు సానుభూతిపరులు పాల్గొంటారని అన్నారు.