calender_icon.png 30 July, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెయులో మైనార్టీ ఉద్యోగులకు సన్మానం

29-07-2025 08:42:37 PM

హన్మకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): ఇటీవల ఉద్యోగ విరమణ, పదోన్నతి, డాక్టరేట్ పొందిన ఉద్యోగులను సన్మానించినట్లు విశ్వవిద్యాలయ మైనారిటీ ఉద్యోగ సంఘం బాధ్యులు డాక్టర్ మహమ్మద్ ఆసిమ్ ఇక్బాల్, జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ఆజాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల డిప్యూటీ రిజిస్టర్ గా పదోన్నతి పొందిన మహమ్మద్ హబీబుద్దీన్, ఉద్యోగ సంఘం ఎన్నికలలో విజయం సాధించిన మహమ్మద్ యూనిస్, మహమ్మద్ వలీ పాషా, ఉద్యోగ విరమణ చేసిన మహమ్మద్ శుకూర్, మహమ్మద్ సిరాజుద్దీన్ లను శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కనీజ్ ఫాతిమా,విశ్రాంత ఆచార్యులు ఆచార్య మహమ్మద్ ముస్తఫా, గౌసియా బేగం, మహమ్మద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.