calender_icon.png 30 July, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

29-07-2025 08:57:11 PM

దోమకొండ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy Districtబీబీపేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ(Government Advisors Mohammed Shabbir Ali) ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. బిబిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన మాందాపూర్, కోనాపూర్, బిబిపేట్ గ్రామస్తులకు చెందిన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇంద్రసేనారెడ్డి, రమేష్, నాగేశ్వరరావు, మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.