29-07-2025 09:37:10 PM
ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కేసుల విచారణలో ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) అధికారులకు సూచించారు. జిల్లాలోని సీరోల్, మరిపెడ పట్టణ పోలీస్ స్టేషన్లను ఎస్పీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. వివిధ కేసుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన పెంచాలన్నారు. సీసీ కెమెరాల వినియోగం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణను పరిశీలించారు. కొత్తగా పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్, సి ఐ రాజ్ కుమార్, బీసీఆర్బీ సిఐ సత్యనారాయణ, ఎస్సైలు సతీష్, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.