1 April, 2026 | 2:31 AM

విద్యాభివృద్ధికి చేసిన ఎంఈవో కృషి అభినందనీయం

01-04-2026 12:38 AM

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

తాండూరు, మార్చి 31 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా వెంకటయ్య గౌడ్ విద్యాభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎంఈఓ పదవి విరమణ పొందిన వెంకటయ్య  ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వెంకటయ్యఉపాధ్యాయుడిగా,ఎంఈఓగా సుదీర్ఘకాలం పాటు తాండూర్ ప్రాంతంలో ఎంతో మంది పేద విద్యార్థుల ఉన్నతికీ కృషి  చేస్తూనే విద్యా రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు,   

పదవి విరమణ తర్వాత విద్యాభివృద్ధి కోసం వెంకటయ్య ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ఎంఈఓ వెంకటయ్య కు ఎమ్మెల్యే , ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, కుటుంబ సభ్యులు భారీగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్ జుంటుపల్లి వెంకటేష్ , నాయకులు పలువురు పాల్గొన్నారు..