కొత్తూరు మున్సిపల్ బడ్జెట్ రూ.36.51 కోట్లు
బడ్జెట్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్, మార్చి 31 (విజయక్రాంతి): కొత్తూరు మున్సిపాలిటీ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.36.51 కోట్లు అంచనా బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం కొత్తూరు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బడ్జెట్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు,అధికారులు భాగ్యస్వామ్యంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అన్ని రకాల పనులు,అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్,నాన్ ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో కలిపి మొత్తం రూ .36.51 కోట్లుతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ డోలి రవీందర్,కౌన్సిలర్లు మాధవి గోపాల్ గౌడ్,చంద్రకళ రాజేందర్ గౌడ్,కోస్గి శ్రీనివాస్,సోమ్లా నాయక్,వీరమోని హేమ దేవేందర్ ముదిరాజ్,కమ్మరి జయమ్మ జనార్దన్ చారి, మాదారం నరసింహ గౌడ్, బ్యాగరి ప్రసన్న లత యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.




