calender_icon.png 23 September, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకి మరింత చేరువగా మెసేజ్ యువర్ ఎస్పీ

23-09-2025 05:40:58 PM

మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నెంబర్: 6303922572

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, దూరప్రాంతాల్లో ఉన్న  పిర్యాదు చేయడానికి అందుబాటులోకి తీసుకవచ్చిన మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సప్ నెంబర్ 6303922572,  డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ  తెలిపారు. వాట్సప్ మెసేజ్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న జిల్లా ఎస్పీ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకంగా సేవలు అందించాలనే లక్ష్యంతో అందుబాటులోకి తీసుకవచ్చిన మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సాప్ నంబర్ 6303922572, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ని ప్రజలు సద్వినియోగం చేసుకోని ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా ఎస్పీ  తెలిపారు.

ఈ మేరకు మంగళవారం రోజున ఒక ప్రకటన జారీ చేశారు. మెసేజ్ యువర్ ఎస్పీ,డయల్ 100 ద్వారా జిల్లా పరిధిలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన, ఎలాంటి సమచారాన్ని అయిన క్షణాల్లో పోలీసు అధికారులకు చేరవేయవచ్చని అన్నారు. ప్రధానంగా ఫిర్యాదులు, నేరాలు,ఉమెన్ హారస్మెంట్స్, ఈవ్ టీజింగ్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన సంఘటనలు, అక్రమ రవాణా, మొదలైన సమాచారం మెసేజ్ రూపంలో అందిస్తే వెంటనే స్పందించి ఆ పరిధిలోని డీఎస్పీ  ఇన్స్పెక్టర్లు, ఎస్సైల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమాచారం చేరవేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎల్లవేళలా వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండే విధంగా ఈ నెంబర్స్ తన పర్యవేక్షణలోనే ఉంటుందని ఎస్పీ  వెల్లడించారు.