13-12-2025 08:28:41 PM
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) జట్టుతో మెస్సీ జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతోంది. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగుతోంది. సింగరేణి ఆర్ఆర్ టీమ్ తరఫున రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగారు. మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టారు. మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ(Lionel Messi) రెండు గోల్స్ కొట్టాడు. ఇరు జట్లతో కలిసి రేవంత్ రెడ్డి, మెస్సీ ఫొటోలు దిగారు. మెస్సీ గ్యాలరీలో ఉన్న అభిమానులకు ఫుట్ బాల్ కిక్ చేసి గిఫ్ట్ గా ఇచ్చారు.