13-12-2025 08:25:26 PM
హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి..
గరిడేపల్లి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన గరిడేపల్లి సర్పంచి అభ్యర్థి పెండెం శోభారాణి ధనయ్య గౌడ్ ను ప్రజలంతా ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంక రెడ్డి అన్నారు. శనివారం ఆయన అన్ని వార్డులలో ఇంటింటి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రజా సంక్షేమం కోసం, మౌలిక వసతుల కల్పన కోసం పాటుపడతారని ప్రచారంలో ప్రజలకు హామీలను ఇస్తూ ఆశీర్వదించాలని ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను పంచాయితీ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యను పరిష్కరిస్తారని ఆయన అన్నారు. వీధిలైట్లు డ్రైనేజీ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని నిరంతరం ప్రజాసేవకై అంకితమై ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కడియం స్వప్న,పెండెం వీరయ్య గౌడ్, పెండెం ధనయ్య, ప్రధాని సైదులు, రాజ మహమ్మద్, పెండెం వినోద్, సుందరయ్య, కానుగు నగేష్, బండ్ల గోపాల్, సతీష్, పిట్ట నరసయ్య, చిట్యాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు