13-12-2025 03:38:34 PM
హైదరాబాద్: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ(Football legend Lionel Messi), రోడ్రిగో, లూయిస్ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా మెస్సీ నగరానికి వస్తున్నారు. రాత్రి 7.50 గంటలకు మెస్సీ- గోట్ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభ కానుంది. రాత్రి 8.06 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మైదానంలోకి దిగనున్నారు. 8.06 గంటలకు దిగ్గజ క్రీడాకారుడు మెస్సీ మైదానంలోకి దిగుతారు.
రాత్రి 8.08 గంటలకు రోడ్రిగో, లూయిస్ సువారెజ్ మైదానంలోకి దిగనున్నారు. రాత్రి 8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ జరుగుతోంది. రాత్రి 8.18 గంటలకు రాహుల్ గాంధీ మైదానంలోకి దిగనున్నారు. మెస్సీ విమానాశ్రయం నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్(Falaknuma Palace)కు వెళ్లనున్నారు. 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. మెస్సీ బృందం సాయంత్రం 6.30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకోనుంది. మెస్సీ ముందు 30 మంది పిల్లలకు ఫుట్ బాల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ, రేవంత్ విన్నర్, రన్నరప్ జట్లకు గోట్ కప్ అందించనున్నారు. మెస్సీని రాష్ట్రప్రభుత్వం తరుఫున సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు.