calender_icon.png 21 January, 2026 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో రైల్ ఎక్స్ ఖాతా హ్యాక్

20-09-2024 12:07:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్19(విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు వివరాలను తెలిపే ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఎక్స్ ఖాతా హ్యాక్ అయింది. తామే హ్యాక్ చేసినట్లు సైబర్ నేరగాళ్లు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక అకౌంట్‌లో హ్యాక్డ్ ఆన్ సొలానా పేరుతో ఈ విషయాన్ని ట్వీట్ కూడా చేశారు. క్రిప్టో కరెన్సీ టోకెన్ కొనమని సైట్ అడ్రస్‌ను కూడా హ్యాకర్లు షేర్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎల్‌అండ్‌టీహైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించారు.