calender_icon.png 19 October, 2025 | 12:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్‌లో అర్ధరాత్రి నాకాబంది

17-10-2025 01:06:00 AM

మేడ్చల్, అక్టోబర్ 16(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి పోలీసులు నాకాబంది నిర్వహించారు. డిసిపి కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఏసిపి శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మార్కెట్ రోడ్ జంక్షన్, వివేకానంద విగ్రహం, వినాయక నగర్ ప్రాంతాలలో మూడు టీములు తనిఖీలు చేపట్టాయి. 192 వాహనాలు తనిఖీ చేయగా, ఇందులో 25 వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

త్రిపుల్ రైడింగ్ 3, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కేసులు 14, నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన రెండు కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన ఆరు కేసులు నమోదయ్యాయి. మొత్తం 8 వాహనాలను సీజ్ చేశారు. రూ.23623 పెండింగ్ చలాన్ లు వసూల్ అయ్యాయని సి ఐ సత్యనారాయణ తెలిపారు. నాకాబంది కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి తో పాటు, సిఐలు సత్యనారాయణ, కిరణ్, నలుగురు ఎస్సులు, 44 మంది ఏఎస్‌ఐలు, కానిస్టేబుల్ పాల్గొన్నారు.