17-10-2025 01:04:57 AM
శామీర్ పేట్ , అక్టోబర్ 16: శామీర్ పేట్ లో సబ్ రిజిస్ట్రార్, వివాహాల అధికారి కార్యాలయ నూతన భవనాన్ని గురువారం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు రిజిస్ట్రేషన్ అండ్ స్టాప్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి లతో కలిసి ప్రారంభించారు.
ఇప్పటివరకు శామీర్ పేట్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగించగా కార్యాలయానికి వచ్చే ప్రజలకు పార్కింగ్ ఇబ్బంది ఉండటంతో కాగా శామీర్ పేట్ గ్రామానికి చెందిన స్థానిక నాయకులు విరాళాలు సేకరించి నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని నిర్మించుకున్నారు.
అయితే విరాళాలు అందించిన స్థానిక నాయకులను సబ్ రిజిస్టర్ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదని స్థానిక నాయకులు అసంతృప్తి చెందుతున్నారు అని మాజీ ఎంపీటీసీ ఇలాసాగరం సుదర్శన్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అశోక్ కుమార్, సబ్ రిజిస్టర్ అనిల్ కుమార్, ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి తహసిల్దార్ యాదగిరి రెడ్డి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.