17-10-2025 01:06:08 AM
హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాం తి): రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. నాలుగైదు రోజులుగా మేడారం ఆయల అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిం దే. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి, పీపీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తోనూ మంత్రి సురేఖ భేటీ అయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశానికి సురేఖ హాజరుకాలేదు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని, కొందరు మాత్రం ఈ ఎపిసోడ్‌ను సముద్రంలో తుఫానులా సృష్టించారని వ్యాఖ్యానించారు.