27 August, 2026 | 2:11 AM

60 గజాల స్థలాల కోసం పోరాటం..

27-08-2026 12:44 AM

బాధితులకు అండగా టీఆర్‌ఎస్

మొయినాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ సర్వే నంబర్ 151లో పేదలకు గతంలో కేటాయించిన 60 గజాల ఇంటి స్థలాల కోసం 62 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న బాధితులను కవిత పరామర్శించారు. పేదలకు కేటాయించిన స్థలాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కవిత హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కుమ్మరి శివశంకర్, చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి బేగరి రాజు, పైమీద పాషా, మొయినాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, మండల అధ్యక్షుడు మేకాగూడెం బిక్షపతి, షాక్ మహమ్మద్ నూర్భాయ్, కుమ్మరి పవన్కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 60 గజాల స్థలాల బాధితులు పాల్గొన్నారు.