27 August, 2026 | 1:49 AM

పాల్వంచలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

27-08-2026 12:00 AM

పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా మేయర్ మూడ్ గణేష్ 

పాల్వంచ ఆగష్టు 26, (విజయక్రాంతి): మొహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్బంగా బుధవారం పట్టణ పరిధిలో గల అబ్దుల్ కలాం టవర్ కు సమీపంలో ఉన్న జామే మసీద్ లో మిలాదున్నభి వేడుకలు మార్కజి ఆహేలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా మంగళవారం రాత్రి మజీదులో ముస్లిం సోదరులు జాగరణ చేసి, ప్రత్యేక నమాజ్ చేశారు. పట్టణం లో ఉన్న పలు మజీద్ లకు చెందిన ముస్లింలు ప్రధాన మజీదైన జామే మజీద్ కు చేరుకొని, ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో సుమారు పది కిలోమీటర్ల మేరకు జులుసే మొహమ్మది (శాంతి ప్రదర్శన) నిర్వహించారు. జామే మజీద్ మౌలానా సర్ఫరాజ్ ఆలం ఖాద్రి ఆధ్వర్యంలో, జామే మసీద్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్ ఉల్ హుస్సేన్, ఇబ్రహిం కురేషి ల నేత్రుత్వంలో భారీ శాంతి ప్రదర్శన నిర్వహించారు.

స్థానిక జామే మజీద్ నుండి ప్రారంభ మైన శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద  జామే మజీద్ కమిటీ అధ్యక్షులు ఫయాజ్ మాట్లాడుతూ ఆ నాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, మేసులు కుంటూ, వక్రమార్గన వెళుతున్న ఎందరినో సక్రమార్గన నడిపించిన ధీశాలి ప్రవక్త అన్నారు. బానిసను సోదరుడిగా చూడమని, వారిని విముక్తి చేయటం గొప్ప పుణ్య మని ప్రవక్త బోదించారన్నారు.  ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష, మేయర్ మూడ్ గణేష్ ,మజీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం డి ఇబ్రహీం ఖురేషి, వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ హుస్సేన్, ఉపాధ్యక్షలు ఎం డి. జైనుల్లా బుద్దీన్, కమిటీ భాద్యులు ఎండి అక్బర్ తదితరులు పాల్గొన్నారు.