27 August, 2026 | 1:32 AM

కేంద్ర సాయం లేకున్నా మేం వెనక్కి తగ్గం

27-08-2026 12:00 AM
  1. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటీ వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు 
  2.   15,475 మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. చివరి బిల్లులు రూ.185 కోట్లు జమ చేశాం 
  3. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): పేదవాడి సొంతింటి కలను సాకా రం చేయడంలో కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురుచూశామని, పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి విడుదల కాలేదన్నారు.

కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేసినా.. నిధులు వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే చివరి నిధులు విడుదల చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15,475 మంది లబ్ధిదారులకు రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. మార్చి 31వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు చివరి బిల్లుల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం నాడు జమ అవుతాయని తెలిపారు.

మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తామని, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పేదలకు సొంతింటి   గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు సుమారు 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి సెప్టెంబర్ 15లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.