ముషీరాబాద్‌లో భక్తిశ్రద్దలతో మిలాద్ ఉన్ నబీ
- భోలక్‌పూర్‌లో భారీ ర్యాలీ
- హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, అడిషనల్ డీసీపీ నర్సయ్య
ముషీరాబాద్,ఆగస్టు 26 (విజయక్రాంతి): మహ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం ప్రతి ఒక్కరూ మానవత్వం, దయ, ప్రేమ, శాంతి గుణం కలిగి ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. బుధవారం మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని ముషీరాబాద్, భోలక్ పూర్, ఏక్ మినార్ తదితర ప్రాంతాలలో బైక్ ర్యాలీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముషీరాబాద్ ఏక్ మినార్ వద్ద జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త శాంతి, దయా గుణాన్ని ప్రసాదిం చినట్లు ప్రతి ఒక్కరూ ఆయన బోధనలు అనుసరిస్తూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ మైనార్టీ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ పర్వేజ్, నాయకులు మహ్మద్ మోసీన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకలను పురస్కరించుకొని భోలక్ పూర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిక్కడపల్లి ఏసీపీ రణ్ వీర్ రెడ్డి, సీఐ రాజగోపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహలు హాజరై ర్యాలీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని మతపెద్దలు సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల్లో ఐక్యతకు మిలాద్ ఉన్ నబీ వేడుకలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పండుగను జరుపుకుంటూ మతసామరస్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు అక్లక్ హుస్సేన్, భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, నబీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మసూద్, డివిజన్ కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షుడు జఫీర్ ఉద్దీన్, అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.






